ఫీల్డ్ లోకి హైడ్రా మాన్సూన్ టీమ్స్...62 టెండర్లలో 40 ఓపెన్

ఫీల్డ్ లోకి హైడ్రా మాన్సూన్  టీమ్స్...62 టెండర్లలో 40 ఓపెన్
  • అర్హత సాధించిన 18 మంది  
  •     నేడు మరో 22 టెండర్లను తెరవనున్న అధికారులు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా మాన్సూన్ ఎమ‌‌‌‌ర్జెన్సీ టీమ్‌‌‌‌ లు సోమవారం రంగంలోకి దిగాయి. రూ.65 కోట్లకి సంబంధించి 62 టెండర్లను హైడ్రా ఆహ్వానించగా, 44 టెండర్లను ఆదివారం తెర‌‌‌‌వ‌‌‌‌గా.. 4 ఆర్హత సాధించ‌‌‌‌లేదు. మిగిలిన వాటిలో 18 మంది అర్హత సాధించారు. మ‌‌‌‌రో 22 టెండ‌‌‌‌ర్ల ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తుల‌‌‌‌ను మంగళవారం ప‌‌‌‌రిశీలించనున్నారు. అర్హత సాధించిన కాంట్రాక్టర్లు టీమ్స్ ను రంగంలోకి దింపారు. 

సోమవారం ఐటీ కారిడార్, ఖైరతాబాద్ తోపాటు  పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే విస్తరించి ఉన్న ప్రాంతాల్లోకి టీమ్స్​వెళ్లాయి. మొత్తం 300  బృందాల్లో 150 రాగా, మిగతావి టెండర్లు పూర్తికాగానే రానున్నాయి. అయితే,  కేవలం 5 సంస్థలకే టెండ‌‌‌‌ర్లు క‌‌‌‌ట్టబెట్టారని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపించగా, హైడ్రా ఖండించింది.