హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ప్రజావాణికి సోమవారం 47 ఫిర్యాదులు వచ్చాయని అడిషనల్ డైరెక్టర్ పాపయ్య తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం బహదూర్ పల్లి లోని సర్వే నంబర్ 227లో 353 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో అక్కడ కొన్ని ఇండ్లు వెలిశాయని, ఓ ఫంక్షన్‌హాల్ ను నిర్మించి ప్రఈ కార్యక్రమానికి రూ.70 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదుదారుడు తెలిపారు.
అలాగే, కీసర మండలం నాగారం మున్సిపాలిటీలోని వెస్ట్ గాంధీ నగర్‌తోపాటు పలు కాలనీల నుంచి మురుగు నీరు, వరద నీరు కోమటికుంటకు వెళ్లేవని, సంబంధిత నాలాను పూడ్చడంతో ఇబ్బంది పడుతున్నామని పలువురు పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం శ్రీ రమణ కాలనీ సర్వే నంబర్60లో ప్రభుత్వ భూమిలోకి జరిగి 8 దుకాణాలు నిర్మించి వ్యాపారం చేస్తన్నారని, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు కాలనీవాసులు ఆరోపించారు. పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఆక్రమణలోని దాదాపు 200 గజాలతోపాటు మొత్తం 700 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరారు.
వికారాబాద్లో ప్రజావాణికి 16..
వికారాబాద్, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అడిషనల్కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 16 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. డీఆర్వో మంగ్లీ లాల్, ఆర్డీవో వాసుచంద్ర, డీఆర్డీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
