హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 42 ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రా అడిషనల్ డైరక్టర్ వర్ల పాపయ్య ఫిర్యాదులను స్వీకరించారు. ప్రగతినగర్ శ్మశానవాటిక స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, దీనికి ఆనుకుని ఉన్న చెత్త డంపింగ్ యార్డుకు కూడా కేటాయించిన స్థలాన్ని కూడా వదలడం లేదన్నారు. బాచుపల్లి పెద్దకుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ పరిధిలో శ్మశానవాటిక నిర్మిస్తున్నారని, కోర్టులో కేసు ఉన్నప్పటికీ నిర్మాణాలు ఆగడంలేదని కంప్లయింట్వచ్చింది.
కోర్టులో కేసు పెండింగ్ ఉన్నా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలోని పోచమ్మ ఆలయ స్థలంలో అపార్ట్మెంట్కడుతున్నారని, అమీన్‌పూర్ సర్వేనంబర్ 971లోని పోచమ్మకుంటలో కూడా శ్మశానవాటిక కడుతున్నారని స్థానికులు కంప్లయింట్ఇచ్చారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ ఎస్‌బీఆర్ కాలనీలో 25 ఫీట్ల రోడ్డును 5 అడుగుల మేర ఆక్రమించి షాపులు నిర్మించారని, అంబులెన్స్‌లు, స్కూల్‌బస్సులు రాలేని పరిస్థితి ఉందని ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
మూడు కార్పొరేషన్లలో 110 ఫిర్యాదులు
మూడు మున్సిపల్కార్పొరేషన్లలోని హెడ్ ఆఫీసుల్లో జరిగిన ప్రజావాణిలకు 110 ఫిర్యాదులు వచ్చాయి. సీఎంసీ కి 42, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో 35, ఎంఎంసీ ప్రజావాణికి 33 ఫిర్యాదులు అందాయి. వీటిని ఆయా కార్యాలయాల్లో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు ఆర్వీ కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి లు స్వీకరించారు.
కలెక్టరేట్లో..
హైదరాబాద్ సిటీ : హైదరాబాద్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ (లోకల్ బాడీస్) జి. జితేందర్ రెడ్డి, డీఆర్వో ఈ. వెంకటాచారి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. హౌసింగ్ కు 252, రెవెన్యూ 74, వివిధ ఇతర శాఖలకు సంబంధించి 18 అర్జీలు అందాయని తెలిపారు.
