ఖాజాగూడ చెరువు కబ్జాలపై ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మంగళవారం ( జనవరి 20 ) ఖాజాగూడ చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు కమిషనర్ రంగనాథ్. ఖాజాగూడ చెరువు తూములు, అలుగులు మూసివేసినట్టు గుర్తించామని తెలిపారు రంగనాథ్.
చెరువు నీటి ప్రవాహాన్ని డైవర్ట్ చేసినట్టు నిర్దారించామని.. చెరువుకు అనుసంధానంగా ఉన్న కిందభాగంలోని చిన్న చెరువు రూపురేఖలు మార్చినట్టు గుర్తించామని తెలిపారు.
ఖాజాగూడ చెరువు ఆనవాళ్లు లేకుండా చేయడంపై సీరియస్ అయ్యారు కమిషనర్ రంగనాథ్. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించామని.. ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో షెడ్డులు నిర్మించినట్టు పరిశీలనలో వెల్లడయ్యిందని అన్నారు. చెరువు కబ్జాలపై పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు రంగనాథ్.
