రాజేంద్ర నగర్ లో రోడ్డును ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం.. హైడ్రా కూల్చివేత..

రాజేంద్ర నగర్ లో రోడ్డును ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం.. హైడ్రా కూల్చివేత..

రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. మంగళవారం ( మే 6 ) స్థానిక ఇందిరా గాంధీ సొసైటీలో ఆక్రమణలను తొలగించారు హైడ్రా అధికారులు. రోడ్డును ఆక్రమించి ప్రహారీగోడ నిర్మించటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని హైడ్రకు ఫిర్యాదు చేశారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు అధికారులు.

ఈ క్రమంలో హైడ్రా అధికారులతో  వాగ్వాదానికి దిగారు ఆక్రమణదారులు.ప్రహారీగోడ నిర్మించిన స్థలం తమదే అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు ఆక్రమణదారులు. దీంతో ఘటనాస్థలం దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

►ALSO READ | గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు.. లేఔట్ లో రోడ్లు, పార్కుల్లో అక్రమణల తొలగింపు..

పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టిన అధికారులు గోడను పడగొట్టి ప్రజలకు రహదారిని ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులు అధికారులను అడ్డుకొని వాగ్వాదానికి దిగటంతో ఘటనాస్థలంలోనే పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.