గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు.. లేఔట్ లో రోడ్లు, పార్కుల్లో అక్రమణల తొలగింపు..

గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు.. లేఔట్ లో రోడ్లు, పార్కుల్లో అక్రమణల తొలగింపు..

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా.. మంగళవారం ( మే 6 ) గచ్చిబౌలిలోని అక్రమకట్టడాలను తొలగించింది హైడ్రా. స్థానిక సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హోసింగ్ సొసైటీ లే ఔట్ లో అక్రమ కట్టడాలను గుర్తించిన హైడ్రా.. లే అవుట్ లో రోడ్స్, పార్క్ లో ఆక్రమణలను తొలగించింది. అనుమతులు లేని కట్టడాలను కూల్చేసినట్లు తెలిపారు అధికారులు. 

లేఅవుట్లో తమ ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగింది హైడ్రా. ఈ క్రమంలో సంధ్య కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు , కిచెన్, రెస్ట్  రూమ్ లను కూల్చేశారు హైడ్రా అధికారులు. లేఅవుట్ ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్ తొలగించారు అధికారులు.

►ALSO READ | సమ్మె విరమించండి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది..