
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు మే 7 నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన నేపత్యంలో ... వారి డిమాండ్ల పరిష్కారంలో ఆర్టీసీ INTUC కార్మిక సంఘంనేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. ఆర్టీసీ సమస్యలను మంత్రికి వివరించారు. వారి సమస్యలను సావదానంగా విన్న మంత్రి ఆర్టీసి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని.. సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ కార్మికులు మంత్రి విఙ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ సమస్యలను పరిష్కరించి.. సంస్థను బలోపేతం చేసేదిశగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా .. ఎవరికి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకవాలని మంత్రి కోరారు. ఏం సంఘం నేతలైనా తనతో ఆర్టీసీ సమస్యలను చర్చించవచ్చని మంత్రి పొన్నం అన్నారు. మంత్రిని కలిసిన వారిలో INTUC ఆర్టీసీ కార్మిక సంఘం కార్యదర్శి రాజిరెడ్డి ,వైస్ చైర్మన్ అబ్రహాం ఇతరులు ఉన్నారు.
►ALSO READ | ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి : ఇలా త్రిపాఠి