
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
చండూరు, వెలుగు : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. చండూరు మండలం పుల్లెంలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రాత్రి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులు, నిర్వాహకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో లారీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నుంచి ప్రతిరోజు రెండు వాహనాలు ఏర్పాటు చేసి వెంటవెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని చెప్పారు.
ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏపీఎం పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో కలెక్టర్ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీశ్, అధికారులు ఉన్నారు.