- ‘ఎక్స్’లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మహానగర ఆస్తులు, విపత్తుల సమ యంలో ప్రజల ప్రాణాలు కాపాడటంలో హైడ్రా పోషిస్తున్న పాత్ర అభినందనీయ మని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ‘‘వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడ టంతో పాటు సిటీ సౌందర్యానికి, పర్యా వరణ పరిరక్షణకు ఆయువుపట్టులైన చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రజా ప్రభుత్వం ఆలోచనలను హైడ్రా ఆచరణ లో పెడుతోంది.
ఆ క్రమంలో మీర్ ఆలం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న పలువురు ఇంజనీర్లు, కార్మికులు అనుకోని ఆపదలో చిక్కుకోగా రంగంలోకి దిగి, వారి ప్రాణాలను కాపాడిన హైడ్రా సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు” అని పేర్కొన్నారు.
