
న్యూఢిల్లీ : ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్‌లో సమస్య కారణంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ మోడల్ అయోనిక్ 1,744 యూనిట్లను రీకాల్ చేస్తోంది. ఇండస్ట్రీ సంస్థ సియామ్ఈ విషయాన్ని తెలిపింది. కంపెనీ జులై 21, 2022– ఏప్రిల్ 30, 2024 మధ్య తయారు చేసిన యూనిట్లను రీకాల్ చేస్తోందని, ఆ భాగాన్ని సరిచేసి ఇస్తుందని సియామ్ వెబ్‌సైట్ తెలిపింది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్‌లో సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి. రిపేర్ పూర్తిగా ఉచితమని హ్యుందాయ్ కంపెనీ ప్రతినిధి అన్నారు. హ్యుందాయ్ మోటార్ ఇండియాలో, కస్టమర్ భద్రత తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అయోనిక్ 5 ప్రారంభ ధర రూ. 46.05 లక్షలు (ఎక్స్-షోరూమ్).