నేను గాంధేయవాదిని.. రాహులియన్‌‌‌‌ని కాదు..కాంగ్రెస్ నేత మణి శంకర్‌‌‌‌ అయ్యర్‌‌‌‌

నేను గాంధేయవాదిని.. రాహులియన్‌‌‌‌ని కాదు..కాంగ్రెస్ నేత మణి శంకర్‌‌‌‌ అయ్యర్‌‌‌‌

న్యూఢిల్లీ: తాను ‘గాంధేయవాదిని, నెహ్రూవాదిని, రాజీవ్‌‌వాదిని’అని, కానీ ‘రాహులియన్‌‌’ని కాదని కాంగ్రెస్‌‌ సీనియర్‌‌‌‌ నేత మణి శంకర్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ అన్నారు. రాహుల్‌‌ తన కంటే వయసులో 30 ఏండ్లు చిన్నవాడని, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదని, అందుకే ఆయనకు తాను దూరమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం పీటీఐతో మణి శంకర్‌‌‌‌ మాట్లాడుతూ.. తనకు ఆరేండ్లు, తన తమ్ముడికి నాలుగేండ్లు ఉన్నప్పుడు మహాత్మా గాంధీ మమ్మల్ని ఎత్తుకొని, ‘వీరు నా కండ్లలోని సూర్యచంద్రులు’అని అన్నారు. అప్పటి నుంచే తాను గాంధేయవాదిని అయ్యానన్నారు. రాజీవ్‌‌ గాంధీ తనకంటే రెండేండ్లు చిన్నవాడైనప్పటికీ.. తనను పీఎంవోలోకి తీసుకోవడంతో పాటు ఆయన చేసిన పనులు ఆశ్చర్యపర్చాయన్నారు. అందుకే తాను రాజీవ్‌‌ వాదిని అయ్యానన్నారు.