
అబుదాబి: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్–13 కోసం యూఏఈకి తొమ్మిది బ్యాట్లు తీసుకువచ్చినట్టు చెప్పాడు. సాధారణంగా తన బ్యాట్లు మూడు, నాలుగు నెలలు పని చేస్తాయని, కానీ ముందు జాగ్రత్తగా ఒకేసారి అన్నీ తెచ్చుకున్నానని తెలిపాడు. ‘సాధారణంగా నా బ్యాట్లు చాలా కాలం మన్నుతాయి. నాలుగైదు నెలల వరకు ఢోకా ఉండదు. కానీ ఆడే ఫార్మాట్వల్ల ఈ టైమ్ మారొచ్చు. టీ20 ఫార్మాట్ ఆడేటప్పుడు రకరకాల షాట్స్ కొట్టాల్సి వస్తుంది. భారీ షాట్స్ కొడతాం. అందువల్ల త్వరగా విరిగే ప్రమాదముంది. ఐపీఎల్ టీ20 ఫార్మాట్. రెండు నెలలకు పైగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టైమ్ కు కొరియర్ అందుతుందో లేదో తెలియదు. అందుకే ఎందుకైనా మంచిదని ఒకేసారి తొమ్మిది బ్యాట్లు వెంట తెచ్చుకున్నా’ అని ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియోలో రోహిత్ చెప్పాడు.