
భారత మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ టెస్ట్ బ్యాటింగ్‌లో ఎంత మజా ఉంటుందో అందరికీ విదితమే. భారత జట్టు ఎప్పుడు కష్టాల్లో ఉన్న 'ది వాల్' అడ్డుగోడలా నిలబడేవారు. ఈ వెటరన్ బ్యాటర్‌కు బౌలింగ్ చేయాలంటే.. బౌలర్లకే విసుగుపుట్టేది. భారత జట్టులో అలాంటి గొప్ప ఆటగాడి స్థానాన్ని భర్తీ చేసిన మరో క్రికెటర్.. చటేశ్వర్ పుజారా. అలాంటి ఆటగాడిని ఓ భారత యువ క్రికెటర్ తక్కువ చేసి మాట్లాడారు.
'పృథ్వీ షా..' ఈ యువ క్రికెటర్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రోజుల్లో సెహ్వాగ్ అంటూ కొందరు, సచిన్ అంటూ మరికొందరు పొగడ్తలు కురిపించారు. అలాంటి ఈ కుర్ర క్రికెటర్‌కు నేడు జట్టులో చోటు లేదు. అందుకు ప్రధాన కారణం.. అతడి ఆట తీరు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో అనవసరపు షాట్లకు ప్రయత్నించి ఔటవ్వడం అతనికి అలవాటు. ఆ ఆటను మార్చుకోమంటే ఎవ్వరి మాట వినరు. మరోసారి అలాంటి సలహా అతని చెవిని పడగా.. తన ఆటే దూకుడుగా ఆడటమని, పుజారాలా బ్యాటింగ్ చేయమంటే చేయలేనని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్న షా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.."వ్యక్తిగతంగా, నా ఆటను మార్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నా. దూకుడుగా ఆడటమే నాకు ఇష్టం. అలా ఆడుతూనే ఈ స్థాయికి చేరుకున్నా. నేను పుజారా సార్ లాగా బ్యాటింగ్ చేయలేను. పుజారా సార్ నాలా బ్యాటింగ్ చేయలేరు.." అని పృథ్వీ షా తెలిపారు.
Prithvi Shaw said, "whatever has brought me here, I'll stick to that method. I can't bat like Pujara sir, he can’t bat like me. I don't like to change my aggressive batting, be it T20 or any format". (Espncricinfo). pic.twitter.com/2qNyS3Y0F1
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2023