ఇంకా ముగియలే.. ఏదో ఒకరోజు అమెరికా ప్రెసిడెంట్ అవుతా: కమలా హారిస్

ఇంకా ముగియలే.. ఏదో ఒకరోజు అమెరికా ప్రెసిడెంట్ అవుతా: కమలా హారిస్

వాషింగ్టన్: అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తన రాజకీయ జీవితం ఇంకా ముగియలేదని తెలిపారు. అధ్యక్ష పదవి కోసం తాను మరోసారి పోటీ చేసే అవకాశం లేకపోలేదని తెలిపారు. ఏదో ఒకరోజు తాను ప్రెసిడెంట్ అవుతానని, భవిష్యత్తులో వైట్‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ లో ఓ మహిళ ఉంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల బీబీసీకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. 

‘‘నా మనవరాళ్లు వారి జీవితకాలంలో అమెరికాలో కచ్చితంగా ఓ మహిళా ప్రెసిడెంట్ ను చూస్తారు. బహుశా అది నేనే కావచ్చు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో మరోసారి పోటీ విషయమై ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదు. నా రాజకీయ జీవితం ఇంకా ముగియలేదు. కెరీర్ మొత్తాన్ని నేను సేవలో గడిపాను. అది నా రక్తంలోనే ఉంది’’ అని కమలా హరిస్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‎పై విమర్శలు గుప్పించారు. ఆయన అధికారంలోకి వస్తే ఫాసిస్ట్‎లా ప్రవర్తిస్తారని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతారన్న తన అంచనాలు నిజమయ్యాయని చెప్పారు. న్యాయశాఖను ఆయుధంగా మలచుకుంటానని చెప్పిన ట్రంప్, ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారని ఆరోపించారు.