రహమత్నగర్‎లో మెజారిటీ తెప్పిస్తా.. నవీన్ యాదవ్‏కు సీఎన్ రెడ్డి భరోసా

రహమత్నగర్‎లో మెజారిటీ తెప్పిస్తా.. నవీన్ యాదవ్‏కు సీఎన్ రెడ్డి భరోసా

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ బైపోల్‎లో రహమత్​నగర్​నుంచి కాంగ్రెస్‎కు మెజారిటీ ఓట్లు పడేలా కృషి చేస్తానని రహమత్​నగర్​కార్పొరేటర్​సీఎన్​ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఈయనను జూబ్లీహిల్స్‎లోని నివాసంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కలిశారు. ఉప  ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎన్​రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయం కోసం పార్టీ తనకు అప్పజెప్పిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తానన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్​అభ్యర్థి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం సీఎన్ రెడ్డి సమక్షంలో పలువురు ముస్లింలు కాంగ్రెస్‎లో చేరారు.