ప్రాణం పోయినా సెక్యులర్ పార్టీల్లో చేరను: రాజా సింగ్

ప్రాణం పోయినా సెక్యులర్ పార్టీల్లో చేరను: రాజా సింగ్

తన ప్రాణం పోయినా బీఆర్ఎస్ , కాంగ్రెస్ వంటి సెక్యులర్  పార్టీల్లో చేరనని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్  స్పష్టం చేశారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు. తనపై ఉంచిన సస్పెన్షన్​ను బీజేపీ అధిష్టానం ఎత్తివేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణను హిందు రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యం అని అన్నారు. 

మంగళవారం గోషామహల్​లో బీసీలకు జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు పక్కన పెట్టి హిందు రాష్ట్రం కోసం కృషి చేస్తానన్నారు.  గోషామహల్ బీఆర్ఎస్  టికెట్ ఎంఐఎం చేతిలో ఉందని, అందుకే ఆ సీటును పెండింగ్ లో పెట్టారని విమర్శించారు. 

బీజేపీ నాపట్ల సానుకూలంగా ఉంది

తాను బీఆర్ఎస్, కాంగ్రెస్​లో  చేరేది లేదని, ఇండిపెండెంట్​గా పోటీ చేసేది అంతకన్నా లేదని రాజాసింగ్ చెప్పారు. మంగళవారం మీడియాకు ఆయన ఒక వీడియో రిలీజ్​ చేశారు. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని మజ్లిస్ హెడ్ క్వార్టర్ ఆఫీసు దారుస్సలాం నిర్ణయిస్తుందన్నారు. అందుకే దాన్ని పెండింగ్ లో పెట్టారని రాజాసింగ్​ ఆరోపించారు.