సాంకేతిక లోపం.. ఐఏఎఫ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

సాంకేతిక లోపం.. ఐఏఎఫ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

భోపాల్‌లోని బెరాసియాలోని దుంగరియా గ్రామంలోని డ్యామ్ సమీపంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఈ సమయంలో విమానంలో ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బెరాసియాలోని దుంగరియా గ్రామంలోని డ్యామ్ దగ్గర ఈ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఈ సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉండగా.. ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. ల్యాండింగ్‌కి కారణమైన సాంకేతిక సమస్యలను అంచనా వేయడానికి, పరిష్కరించడానికి ఒక బృందం స్థానానికి చేరుకుంది.

“భారత వైమానిక దళం (IAF) ALH ధృవ్ హెలికాప్టర్ ఈరోజు భోపాల్ సమీపంలో ముందుజాగ్రత్తగా ల్యాండింగ్ చేసింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. సాంకేతిక సమస్యలను పరిశీలించడానికి ఒక బృందం మార్గంలో ఉంది”అని IAF నివేదించింది.