వారంలోగా జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేయండి :ప్రియాంక

వారంలోగా జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేయండి :ప్రియాంక
  • అధికారులకు ఐ అండ్​పీఆర్ ​స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఆదేశం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని అధికారులను ఐ అండ్​పీఆర్​స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక టెన్నెల్‌‌లో రాతి పరిస్థితులను అంచనా వేస్తూ బ్లాస్టింగ్ బలహీనంగా ఉన్న చోట కాంక్రీట్‌‌తో లైనింగ్ చేస్తూ పనులు కొనసాగింపుమరో ఐదు మీటర్ల మేర బ్లాస్టింగ్ చేసిన అధికారులుఆదేశించారు. శుక్రవారం ఆమె నాంపల్లిలోని మీడియా అకాడమీలో డీపీఆర్ఓలు, క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు.

జీవో252, 103లపై పూర్తి అవగాహన ఉండాలని, కలెక్టర్లతో సమన్వయం చేసుకుని వారంలోపు జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాతో పాటు ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టుల దరఖాస్తుల పరిశీలన, రిజిస్ట్రేషన్ నెంబర్ల కేటాయింపులో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు తగ్గట్టు అక్రెడిటేషన్ల ప్రక్రియ సాగాలని  అధికారులకు మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సిబ్బందికి ఆన్‌‌లైన్ దరఖాస్తుల నిర్వహణపై అవగాహన కల్పించారు. అర్హత గల జర్నలిస్టులు http://ipr.telangana.gov.in వెబ్‌‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, సందేహాల కోసం 91541 70881 ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ అదనపు డైరెక్టర్ డీఎస్ జగన్, అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.