నౌహీరా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో విచారణకు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నౌహీరా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో విచారణకు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆస్తులను అమ్మేందుకు అప్రూవల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్, సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎంక్వైరీ
  • 2022లో సుమారు రూ.300 కోట్లు విలువ చేసే ఆస్తులు జప్తు చేసిన ఈడీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారి అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం మరోసారి ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హీరా గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధినేత నౌహీరా షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో ఆయనను ఈడీ ప్రశ్నించింది. మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఈడీ అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఆస్తులను ఎలాంటి కోర్టు అనుమతులు లేకుండానే విక్రయించేందుకు సహకరించారనే ఆరోపణలపై వివరాలు సేకరించినట్టు తెలిసింది.

ఈ మేరకు అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు రంగారెడ్డి జిల్లా జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. నౌహీరా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ కంపెనీలకు చెందిన పలు సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా కొన్ని పత్రాలను ఈడీ అధికారులకు సమర్పించినట్టు సమాచారం. కాగా, హీరా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరిట డిపాజిటర్ల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ.299.99 కోట్ల విలువైన నౌహీరా ఆస్తులను ఈడీ 2022లో అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది.

భూదాన్ భూముల కేసులో కాదు.. నౌహీరా కేసు విచారణ 

అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల వ్యవహారంలోనే ఈడీ సమన్లు జారీ చేసి, విచారించినట్టు ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదని ఈడీ స్పష్టం చేసింది. నౌహీరా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు దర్యాప్తులో మాత్రమే అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను విచారిస్తున్నట్టు ధ్రువీకరించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు రంగారెడ్డి జిల్లా జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సైతం ఈడీ విచారించింది. ఈడీ అధికారులు ప్రశ్నించిన కొన్ని అంశాలకు సంబంధించి వివరాలు ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని అమోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరినట్టు తెలిసింది.