ఐసీసీ టీ20 బెస్ట్ ప్లేయర్గా పాక్ ఆటగాడు

ఐసీసీ టీ20 బెస్ట్ ప్లేయర్గా పాక్ ఆటగాడు

లండన్: ఐసీసీ టీ20 ఉత్తమ ఆటగాడిగా పాకిస్తాన్ కు చెందిన బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యారు. ఆదివారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మహ్మద్ రిజ్వాన్ ఎంపిక ను ప్రకటించింది. మహ్మద్ రిజ్వాన్  2021లో 29 టీ20లు ఆడి అత్యుత్తమ స్థాయిలో ఫామ్ కొనసాగిస్తూ.. 134.89 స్ట్రైక్ రేటుతో 1326 పరుగులు చేసి 73.66 సగటు రన్ రేటు నమోదు చేసుకున్నాడు.

అలాగే గత ఏడాది జరిగిన ప్రపంచకప్ టోర్నీలోనూ రిజ్వాన్ తన ఫామ్ కొనసాగించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.  ప్రపంచకప్ లో ఫైనల్ కు చేరిన పాక్ జట్టు తరపున రిజ్వాన్ అత్యధిక పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. అలాగే గత ఏడాది ఆరంభం నుంచి ఇదే స్థాయిలో భీకర ఫామ్ కొనసాగించి పరుగుల వరద పారించాడు. సొంత గడ్డ లాహోర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించి టీ20 మ్యాచుల్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. అటు తర్వాత వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లోనూ 87 పరుగులు సాధించి దూకుడు ప్రదర్శించాడు. ప్రతి టోర్నీలోనూ మహమ్మద్ రిజ్వాన్ దూకుడు ప్రదర్శించి మంచి సగటు నమోదు చేయడంతో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపిక చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. 

 

ఇవి కూడా చదవండి

సయ్యద్ మోదీ టోర్నీలో పీవీ సింధు విజయం

కోహ్లీ గొప్ప క్రికెటర్..బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు