ఐసీసీ ర్యాంకింగ్స్ : కోహ్లీ, రోహిత్ మధ్యే నంబర్ వన్ రేస్

ఐసీసీ ర్యాంకింగ్స్ : కోహ్లీ, రోహిత్ మధ్యే నంబర్ వన్ రేస్

భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరి మధ్య ఐసీసీ వన్డే ర్యాంకింగ్ నంబర్ వన్ రేసు మరింత ఇంట్రస్టింగ్ గా మారింది. టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ మరోసారి నంబర్ వన్ ఐసీసీ వన్డే బ్యాట్స్ మన్ పొజిషన్ ను దక్కించుకున్నాడు. ఐతే… నంబర్ 2 ప్లేస్ లో ఉన్న రోహిత్ శర్మ.. ఈసారి తన పాయింట్లను భారీగా పెంచుకుని… నంబర్ వన్ ర్యాంక్ కు చేరువయ్యాడు. లిస్టులో రెండో స్థానంలో నిలిచినప్పటికీ.. కోహ్లీకి రోహిత్ కు మధ్య చాలా కేవలం 6 పాయింట్ల తేడానే ఉంది.

10జట్లు పాల్గొన్న వరల్డ్ కప్ మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ 891 పాయింట్స్ తో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ  వరల్డ్ కప్ లో ఐదు హఫ్ సెంచరీలు కొట్టాడు. ఐతే… వరల్డ్ కప్ లోనే అత్యధికంగా 5 సెంచరీలు కొట్టి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన రోహిత్ శర్మ 51 పాయింట్లను పెంచుకుని కోహ్లీకి కేవలం 6 పాయింట్ల దూరంలో నిలిచాడు.

పాక్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ 4 పాయింట్లు బెటర్ చేసుకుని టాప్ 3 లో నిలిచాడు. డుప్లెసిస్ 4, రాస్ టేలర్ 5 స్థానాల్లో ఉన్నారు. ఏడాది తర్వాత ఎంట్రీ ఇచ్చి వరల్డ్ కప్ లో దుమ్ములేపుతున్న డేవిడ్ వార్నర్ ఏకంగా ఆరోస్థానంలోకి వచ్చాడు. జో రూట్ 7 ర్యాంక్ లో ఉండగా.. కేన్ విలియంసన్ 4 స్థానాలు మెరుగుపరుచుకుని 8వ ర్యాంక్ దక్కించుకున్నాడు. డికాక్, ఫించ్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.