రేపు ఇంగ్లండ్ తో యువ భారత్ ఫైనల్ ఫైట్

రేపు ఇంగ్లండ్ తో  యువ భారత్ ఫైనల్ ఫైట్

అండర్-19 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకెళ్తుంది యంగ్ ఇండియా. సెమీస్ లో ఆస్ట్రేలియాపై గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా... రేపు ఇంగ్లండ్ తో ఫైనల్లో తలపడనుంది. ఇప్పటికే నాలుగు సార్లు ప్రపంచకప్  చేజిక్కించుకున్న యువ భారత..... ఓవర్ ఆల్ గా ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఫైనల్ కు చేరింది. రేపు ఇంగ్లండ్ తో జరుగనున్న తుదిపోరులోనూ ఇదే జోరు కొనసాగించాలని చూస్తోంది యంగ్ ఇండియా.  అండర్ -19 సెమీస్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది యువ భారత్. రెండో సెమీఫైనల్లో యంగ్ ఇండియా 96 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. దిగ్గజ ఆటగాడు VVS లక్ష్మణ్  కోచింగ్ లో ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తుంది భారత్. లీగ్  దశలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ నెగ్గింది. క్వార్టర్స్ లో డిఫెండింగ్  చాంపియన్  బంగ్లాదేశ్ ను మట్టికరిపించిన మన కుర్రాళ్లు.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను కంగారెత్తించారు.

ఫైనల్  ఫైట్ లో.... 24 ఏండ్ల తర్వాత ఈ టోర్నీ ఫైనల్ కు చేరిన ఇంగ్లండ్ ను యంగ్  ఇండియా ఢీ కొట్టనుంది. భారత్  తరహాలోనే లీగ్  దశలో ఆడిన అన్ని మ్యాచ్ ల్లో నెగ్గిన ఇంగ్లండ్ .... క్వార్టర్స్ లో దక్షిణాఫ్రికాను 6 వికెట్లతో చిత్తు చేసింది. ఇక ఉత్కంఠగా జరిగిన సెమీస్ లో అఫ్ఘానిస్థాన్ పై 15 పరుగులతో గెలిచింది.