ఐస్ మేక్ ఆదాయం రూ.153 కోట్లు

ఐస్ మేక్ ఆదాయం రూ.153 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: రిఫ్రిజిరేషన్ ​సొల్యూషన్స్ ​అందించే హైదరాబాద్​ కంపెనీ ఐస్ మేక్ 2026 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టల్లో రూ.153.36 కోట్ల ఆదాయం సాధించింది. గత మూడో క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ.110.56 కోట్లతో పోలిస్తే ఇది 39 శాతం ఎక్కువ. కంపెనీ నికర లాభం రూ.1.45 కోట్లుగా నమోదైంది. 

కొత్త విభాగాల్లో విస్తరణ వల్ల లాభాలపై కొంత ఒత్తిడి కనిపించింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ.412.35 కోట్ల ఆదాయం లభించింది. కోల్డ్ చైన్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల నుంచి డిమాండ్ బాగుందని చైర్మన్ చంద్రకాంత్ పటేల్ చెప్పారు.