
హైదరాబాద్, వెలుగు: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ (ఐపీఆర్‌యూ ఎంఎఫ్) తెలంగాణలోని కరీంనగర్‌లో తన మొదటి శాఖను ప్రారంభించింది. ఈ ప్రాంతం తమకు ఒక కీలకమైన వృద్ధి మార్కెట్ అని ఈ సందర్భంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ రిటైల్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ - సౌత్ జోనల్ హెడ్ రేణు నారాయణ్ అన్నారు.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈ ఏడాది జులై నాటికి మొత్తం రూ. 10.44 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ 480కి పైగా శాఖల ద్వారా 12.4 మిలియన్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, కమోడిటీ ఫండ్లను అందిస్తున్నామని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ తెలిపింది.