ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్లోని చట్నీస్ హోటల్లో శుక్రవారం మధ్యాహ్నం ఇడ్లీ స్టీమర్ పేలి నలుగురు వంట మనుషులు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా స్టీమర్ పేలడంతో మంటలు వ్యాపించి, అక్కడ పనిచేస్తున్న ఛత్తీస్గడ్కు చెందిన జోగేశ్వర్(20), దయా(23), సుమిత్(21), సునీల్(21)కు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే గమనించిన తోటి సిబ్బంది వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదం బయటకు రాకుండా హోటల్ యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేయగా, కస్టమర్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
