అత్యవసర పరిస్థితుల్లో దవాఖానలో చేరితే రూ. 5 లక్షల పథకం

అత్యవసర పరిస్థితుల్లో దవాఖానలో చేరితే రూ. 5 లక్షల పథకం
  • కేంద్రం 22 లక్షల మందికి అవకాశమిచ్చినా శ్రద్ధ చూపని రాష్ట్ర సర్కారు
  •     పని ఒత్తిడి ఎక్కువైందని తప్పుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
  •     కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లకు బాధ్యతలు  
  •     లబ్ధిదారుల జాబితా బయటపెట్టని ఆఫీసర్లు
  •     మూడు వారాలు దాటినా రెండు శాతం కూడా పూర్తి కాలే... 

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: కార్పొరేట్, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దవాఖానల్లో ప్రతీయేటా కుటుంబానికి రూ.5 లక్షల వైద్య సాయమందించే ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీంపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీంతో రాష్ట్రంలోని సుమారు 22 లక్షల మంది లబ్ధి పొందలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో గుర్తించిన లబ్ధిదారుల లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోలు తీసి ఈ –కేవైసీ పూర్తి చేయాలని మొదట వైద్యారోగ్య శాఖను ఆదేశించినా చేయలేదు. దీంతో కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ల(సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ)కు అప్పగించగా రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రచారం కూడా చేయడం లేదు. కలెక్టర్లు, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు, డీపీఓ వంటి ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటివరకు రెండు శాతం కూడా ఈ –కేవైసీ కాలేదు. 

ఒక్కో గ్రామంలో 40 శాతం వరకు..

రాష్ట్రంలో తెల్ల రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులున్నవారు కోటికి పైగా ఉన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో కూడా సుమారు 80 లక్షల కుటుంబాల పేర్లు నమోదై ఉన్నాయి. సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీంలో మాత్రం తొలి విడత కింద 22 లక్షల మంది పేర్లను చేర్చారు. దీంతో ఒక్కో గ్రామంలో తెల్ల రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులున్న వారిలో సుమారు 30, 40 శాతం మంది పేర్లు మాత్రమే ఈ లిస్టుల్లో వచ్చాయి. జిల్లా, మండలం, గ్రామాల వారీగా ఎక్సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీరి పేర్లు పంపించారు. కొత్త రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు నంబర్​ఆధారంగా ఈ పేర్లు కనిపిస్తున్నాయి.  

వైద్యారోగ్యశాఖ నుంచి సీఎస్​సీలకు....

ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీం లబ్ధిదారుల లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోతో పాటు ఈ –కేవైసీ పూర్తి చేసే బాధ్యతలను మూడు వారాల క్రితం వైద్యారోగ్య శాఖకు అప్పగించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతీ ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం దగ్గర ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన పని వల్ల ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ –కేవైసీ చేయలేకపోతున్నామని ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంల సంఘం తరపున విజ్ఞప్తులు రావడంతో ..ఈ బాధ్యతలను కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ)లకు వారం క్రితం అప్పగించారు. రాష్ట్రంలో సుమారు 7 వేల సెంటర్లుండగా జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలను జిల్లాల సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ కో ఆర్డినేటర్లకు ఇచ్చారు. 

వీరు వారి జిల్లాల పరిధిలోని సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులతో మీటింగ్​పెట్టి గ్రామాలవారీగా ఉన్న లిస్టులను ఇచ్చారు. లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోతో పాటు, వేలిముద్రలు తీసుకోవడం, సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి లబ్ధిదారుల ఈ–కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఈ పనంతా ఒక్క రూపాయి తీసుకోకుండా చేయాలి. అంతా పూర్తయిన తర్వాత ఓ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరేట్​అవుతుంది. ఈ నంబర్​ఆధారంగా లబ్ధిదారులు ఎప్పుడైనా కార్పొరేట్, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి ఉచితంగా రూ.5 లక్షల వరకు ట్రీట్​మెంట్​పొందవచ్చు.  

బయటికిరాని లబ్ధిదారుల లిస్ట్​ 

రాష్ట్ర ప్రభుత్వ స్కీంకు సంబంధించిన పేర్లు వెంటనే గ్రామ పంచాయతీ బోర్డులపై కనిపిస్తుంటాయి. సంబంధిత శాఖ ఆఫీసుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కానీ, ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయానికొచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపించడం లేదు. లబ్ధిదారుల జాబితా గ్రామ పంచాయతీల్లో గానీ, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపుల్లో గానీ కనిపించడం లేదు. ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలు, ఆశ కార్యకర్తల దగ్గర వారి లిస్టులు లేవు. బహిరంగంగా ఎక్కడా కూడా ప్రకటించడం లేదు. కేవలం సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహకుల దగ్గర మాత్రమే ఈ వివరాలున్నాయి. 

ఎవరైనా ఈ స్కీం గురించి అవగాహన ఉన్న లబ్ధిదారులు కామన్​సర్వీస్​సెంటర్లకు వెళ్లి అడిగితేనే లిస్ట్​చూసి వెరిఫై చేసుకుని చెబుతున్నారు. ఒకవేళ పేరు ఉంటే  లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటో తీసుకొని ఈ –కేవైసీ చేసి పంపిస్తున్నారు. అలా కాకుండా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ, డీపీఓ, జిల్లా సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను బాధ్యులను చేసి ఈ–కేవైసీ చేయించాలని చెప్తే ఇప్పటికే సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెంటర్ల వద్ద జనాలు బారులు తీరేవారు. వారి అత్యవసర సమయంలో లబ్ధి కూడా జరిగేది. కానీ, లబ్ధిదారుల లిస్టు వచ్చి వారం గడుస్తున్నా ఎవరికీ తెలియకపోవడంతో సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెంటర్ల వద్ద జనాలెవరూ కనిపించడం లేదు.  

కంటి వెలుగుపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాం

రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి మొదలుకానున్న రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాంపై మా సిబ్బంది ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టారు. ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లబ్ధిదారుల ఈ– కేవైసీ పనులను మొదట  ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలకు అప్పగించినా పని ఒత్తిడి వల్ల చేయలేకపోయారు. దీంతో వేరేవాళ్లకు అప్పగించాల్సి వచ్చింది.  ‒ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ములుగు 

సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెంటర్లకు ప్రజలు రావట్లేదు

ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీం కింద భూపాలపల్లి జిల్లాలో1,87,390, ములుగు జిల్లాలో 77,253 మంది లబ్ధిదారుల లిస్ట్​ మాకు వచ్చింది. ఈ లిస్ట్​లో ఉన్న పేర్లను మండలం, గ్రామాలవారీగా వేరు చేసి మా పరిధిలో ఉన్న సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లకు పంపించాను. కానీ ఈ స్కీంలో తమ పేర్లు ఉన్నాయో లేవో తెలియక లబ్ధిదారులు సెంటర్లకు రావట్లేదు. దీంతో ఈ–కేవైసీ చాలా తక్కువ సంఖ్యలో చేస్తున్నాం.  - మాధురి, సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెంటర్ల కో ఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  భూపాలపల్లి, ములుగు ఉమ్మడి జిల్లా