గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబయిలో సంపద ఉండదు

గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబయిలో సంపద ఉండదు

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే ముంబయి ఆర్థిక రాజధానిగా ఉండే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. ముంబయిలోని అంధేరీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘గుజరాతీలు, రాజస్థానీలను  మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా ముంబయి, థానే నుంచి పంపిస్తే ఇక్కడ సంపద అనే ఉండదు. అప్పుడు దేశ ఆర్థిక రాజధానిగా ముంబయి కొనసాగడం కష్టం’’ అని అన్నారు. 

అయితే ఈ వ్యాఖ్యలపై శివసేన సహా పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, మరాఠీలను గవర్నర్ అవమానిస్తున్నారని అన్నారు. సీఎం షిండేకు ఆత్మగౌరవం ఉంటే వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించడంతోపాటు గవర్నర్ రాజీనామా చేయాలని కోరాలన్నారు. మొరార్జీ దేశాయ్ కూడా 105మంది మరాఠీ అమరవీరులను ఇలా అవమానించలేదంటూ ట్వీట్ చేశారు.