మావోల దాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణం

మావోల దాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణం

న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టుల దాడికి ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యమే కారణమని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఛత్తీస్ గడ్ లో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ ను పకడ్బందీగా నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారని చెప్పారు. 'ఈ ఘటనకు ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణం.. లేకపోతే 1:1 నిష్పత్తిలో మృతుల సంఖ్య ఉండదు కదా. ఈ ఆపరేషన్ ను సరిగ్గా నిర్వహించలేదు' అని రాహుల్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ వర్గాల ఫెయిల్యూర్ ఏమీ లేదని సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంటే మన జవాన్లు ఆపరేషన్ చేపట్టే వారు కాదని, అలాగే అంత మంది నక్సల్స్ నూ మట్టుబెట్టే వారు కాదని పేర్కొన్నారు.