హెల్మెట్‌ ఉంటేనే డ్యూటీ

హెల్మెట్‌ ఉంటేనే డ్యూటీ

పోలీసులు గాని, మరే ఇతర స్వచ్ఛంద సంస్థలుగాని ఎంతగా మొరపెట్టు కున్నా చాలా మంది హెల్మెట్ల వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు.పోలీసులు ఆపితే ఫైన్ కట్టి వెళ్తున్నారే గాని, మన రణక్షణ కోసమే కదా అని హెల్మెట్‌ వాడడం లేదు. భూపాలపల్లి కోల్‌ బెల్ట్‌‌‌‌ ఏరియాలో నిత్యం బొగ్గు లారీలు తిరుగుతుంటాయి. విధులకు వచ్చే కార్మికులు ఈ లారీల కారణంగా ప్రమాదాలకు గురయ్యేవారు. యాజమాన్యం విధించిన హెల్మెట్‌ నిబంధన కారణంగా ఇప్పుడీ ప్రమాదాలు తగ్గు ముఖం పట్టాయి. గని లోపలే కాకుండా బయట కూడా కార్మికులు ప్రమాదాల బారిన పడకుండాచూసిన అధికారులకు కార్మికుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. భూపాలపల్లిలో కఠినమైన నిబంధనలు విధించిన యాజమాన్యం హెల్మెట్‌ అమలులో పూర్తిగా సఫలీకృతమైందని, సింగరేణి వ్యా ప్తంగా ఈ విధానం అమలు చేయాలని వారు కోరుతున్నారు. కార్మికుల క్షేమం కోసం కృషి చేసిన భూపాలపల్లి అధికారులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. శహభాష్‌ టు సింగరేణి టీం.