3 నెలలు రేషన్ తీసుకోకపోతే ఆపేస్తరా?

3 నెలలు రేషన్ తీసుకోకపోతే ఆపేస్తరా?

హైదరాబాద్, వెలుగు: మూడు నెలలగా రేషన్ తీసుకోలేదని చెప్పి నాలుగో నెల నుంచి రేషన్​తోపాటు లాక్​డౌన్ ఆర్థిక సాయం రూ.1,500 నిలిపివేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలలుగా రేషన్​ తీసుకోవడానికి కారణాలను ఆచరణ కోణంలో చూడాలని, పనుల నిమిత్తం పలుచోట్లకు వలస వెళ్లిన వారంతా తిరిగి వచ్చి ఉంటారని, ఆ కారణంగా రేషన్ తీసుకుని ఉండకపోవచ్చని చెప్పింది. తెల్ల కార్డుదారులకు మంజూరు చేసే రూ.1,500 సాయం అందజేయాల్సిన సమయం ఇదేనని, కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చాలని సూచించింది. రేషన్ తీసుకోలేదనే కారణంతో రూ.1,500 సాయం ఎందుకు ఇవ్వడం లేదో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ రెడ్డి లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్​లో 20 లక్షల తెల్ల కార్డులను గాను 17 లక్షల 60 వేల కార్డులు తిరస్కరణ లిస్టులో ఉన్నాయని పిటిషనర్​ తరఫు లాయర్​ వాదించారు. ఏజీ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. రూ.1,500 సాయం అందించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేశామని, ఈ వ్యవహారాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం చెప్పిం దని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, రెగ్యులర్ కోర్టులో వాదనలకు అనుమతించాలని ఏజీ కోరారు.

కరోనా వైరస్ బంధాలను తెంచుతోంది