- వైపర్లు గనుక ఊడిపోయి ఉంటే.. నేను ఉండేవాడిని కాదు
- బెంజ్ కారు బీభత్సంపై కానిస్టేబుల్ నర్సింహులు ఆవేదన
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలో ఆదివారం బెంజ్ కారు సృష్టించిన బీభత్సం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నాడు. “నానక్‌రామ్‌గూడ వద్ద ప్రమాదం చేసి పారిపోతున్న బెంజ్ కారును అడ్డుకోవడానికి ప్రయత్నించా.
ఈ క్రమంలో కారు నన్ను ఢీకొట్టి బానెట్‌పై కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్తున్నప్పుడు.. ఇక ఇదే నా ఆఖరి రోజు అనుకున్నాను. నిందితుడు నన్ను కింద పడేసేందుకు కారును జిగ్‌జాగ్‌గా నడిపాడు. ఆ సమయంలో వైపర్ బ్లేడ్లను గట్టిగా పట్టుకోవడం వల్లే నేను బతికాను. ఆ వైపర్లు గనుక ఊడిపోయి ఉంటే.. ఈరోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదు” అని నర్సింహులు తన ఆవేదనను పంచుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ముందుకు వెళ్తుంటే జనం ఈజీగా తీసుకోవడం దురదృష్టకరమన్నారు.
