
హిందువులు తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. హిందువులకు చెందిన ప్రతి ఇంట్లో తులసి మొక్కను కుండిలో పెంచుతూ.. నిత్యం ఆ మొక్కకు పూజ చేస్తుంటారు. పురాణాల ప్రకారం తులసిమొక్క లక్ష్మీదేవితో సమానం. ఒక్కోసారి తులసి మొక్కలలో కొన్ని అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. మీరు నిత్యం పూజించే తులసి మొక్కలో ఈ మార్పులు వచ్చాయంటే అన్ని విషయాల్లో మీదశ మారుతుందని .. జీవితంలో శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ మార్పుల గురించి తెలుసుకుందాం. .. . !
ప్రతి రోజు హిందువులు తులసి మొక్కకు పూజచేసి.. ధూపం... దీపం..సమర్పించిన తరువాత సరిపడ నీళ్లు సమర్పిస్తారు. తులసిమొక్కను సాక్షాత్తూ లక్ష్మీదేవిగా భావించి పూజలు చేస్తారు. తులసి మొక్కను స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు.
ఇంట్లో తులసి మొక్క ఉండి..... అకస్మాత్తుగా దానిలో కొన్ని రకాల మార్పులు కనిపించడం ప్రారంభిస్తే.. మీ ఇంటికి డబ్బు రాబోతోందని అర్థమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. తులసి మొక్కలో ఈ కనిపించే ఈ లక్షణాలను గుర్తిస్తే ధనవంతులవుతారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. తులసి మొక్క పచ్చగా ఉంటే.. ఆ ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది. కానీ.. తులసి మొక్క ఎండిపోతే ఆ ఇంట్లో కొంత ఇబ్బంది రాబోతోందని అర్థం అని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. కాబట్టి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
పుష్పించే తులసి మొక్క ఇంట్లో ఉంటే శాస్త్రం ప్రకారం ధనవంతులు కావడానికి ముందు ఇంట్లోని తులసి మొక్క కొన్ని శుభ సంకేతాలను ఇస్తుంది. తులసి మొక్క అకస్మాత్తుగా పచ్చగా మారినా.. తులసి మొక్క పువ్వులు పెరగడం ప్రారంభించినా లేదా తులసి మొక్క మొగ్గలు ఎక్కువగా కనిపించడం ప్రారంభించినా.. త్వరలో మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఆదాయం పెరుగుతుందని పలు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. . అకస్మాత్తుగా డబ్బు వచ్చే పరిస్థితులు దాపురిస్తాయి. అంతేకాదు మీరు అప్పుల నుంచి కూడా విముక్తి పొందనున్నారని తులసి మొక్కలో కనిపించే ఈ సంకేతాలకు అర్థమని పండితులు చెబుతున్నారు.
తులసి మొక్క కుండీలో దర్భలు పెరిగితే... ఇది కూడా ధనవంతులు కావడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. దర్భ గణేశుడికి చాలా ప్రియమైనది. తులసి లక్ష్మీ దేవికి ప్రియమైనది. అటువంటి పరిస్థితిలో తులసి మొక్కలో దర్భలు పెరుగుతుండడం అంటే మీరు రాబోయే కాలంలో ధనవంతులు కాబోతున్నారని సూచిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. . .