వేడిగా ఉన్న దోసె పెనాన్ని వంకాయ ముక్కతో రుద్దితే...

వేడిగా ఉన్న దోసె పెనాన్ని వంకాయ ముక్కతో రుద్దితే...
  • బిర్యానీ కోసం అన్నం వండేటప్పుడు అందులో ఒక నిమ్మకాయరసం పిండితే అన్నం పొడిపొడిగా అవుతుంది.
  •   పులిహోర, పలావులాంటివి తయారుచేసేటప్పుడు అందులో ఒక టేబుల్‌ స్పూను వెన్న కలిపితే పొడిగా అవుతుంది.
  •   పూల మొక్కల వేళ్ల దగ్గర టీ పొడి, ఉల్లిపాయ పొట్టు వేస్తే మొక్కలు మంచిగ పెరుగుతాయి. అంతేకాకుండా పూల మొక్కలైతే వాటి పూలు బాగా వాసన వస్తాయి.
  •   పెరుగు తోడు పెట్టేముందు గిన్నెకు పటిక బెల్లం రాస్తే, పెరుగు రుచిగా, సరిగ్గా తోడుకుంటుంది.
  •   వేడిగా ఉన్న దోసె పెనాన్ని వంకాయ ముక్కతో రుద్దితే దోసెలు పెనానికి అతుక్కోకుండా వస్తాయి.
  •   పెనం మీద కొద్దిగా ఉప్పు చల్లితే ఆమ్లెట్‌ పెనానికి అంటుకోదు.
  •   పూరీలు బాగా పొంగాలంటే, పూరీ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలపాలి.