పదవిని చెప్పన్నాడు.. కేసీఆర్ కు ఓటేస్తే చెప్పుకు ఓటేసినట్లే..

పదవిని చెప్పన్నాడు.. కేసీఆర్ కు ఓటేస్తే చెప్పుకు ఓటేసినట్లే..
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

యాదాద్రి భువనగిరి జిల్లా :  కేసీఆర్ కు ఓటేస్తే చెప్పుకు ఓటేసినట్లే, చెప్పుకు ఓటేసే మేధావులు మన దగ్గర లేరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్ చేశారు. ప్రజలు ఇచ్చిన సీఎం పదవి తన చెప్పుతో సమానమని కేసీఆరే చెప్పిండు. టీచర్ల చేతిలో పెన్నులు మాత్రమే ఉన్నాయనుకుంటున్నాడు కేసీఆర్.. 14 వ తేదీన ఓటింగ్ రోజు ఆ పెన్నులు గన్నురూపంలో పేలుతాయ్.. అని ఆయన జోస్యం చెప్పారు. భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బిజెపి కార్య కర్తలతో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎం.ఎల్.సి ఎన్నికల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నయీమ్ అక్రమ ఆస్తులు ఎక్కడపోయాయి…?  అన్నీ కక్కిస్తామన్నారు. ఎప్పుడైతే లక్ష్మీ నర్సింహా స్వామి పక్కన కేసీఆర్ ఫోటో పెట్టినడో , అప్పటి నుంచి ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది… విజయ్ కుమార్ ని సస్పెండ్ చేసిండు… ఇన్ని రోజులకు ఆయన అవినీతిపరుడని గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. 90 శాతం కోవిడ్ వ్యాక్సిన్ కేసీఆర్ కనుక్కొన్నాడట… వారి సొంత ఛానల్లో చెబుతున్నారు.. కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇచ్చాడా…? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. న్యాయవాది వామన రావు దంపతుల హత్య వెనుక టి ఆర్ ఎస్ నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ దృష్టిలో ఎమ్మెల్సీ అంటే మెంబెర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అని బండి అభివర్ణించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బ్రోకర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అని విమర్శించారు. ఈ ఎన్నికలు బిజెపి- టిఆర్ ఎస్ మధ్య ఓ యుద్ధంలాంటిదన్నారు. ఉద్యోగుల పీఆర్ సి మాట ఎత్తటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్సీ కోసం  కలెక్టరేట్ల వద్ద బీజేపీ ధర్నాలు,  ఉద్యమా చేశాయి.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని బీజేపీ యువ మోర్చా ఉద్యమాలు చేసింది..  మేము లాఠీ దెబ్బలు తిన్నాం.. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి  పేరుతో 70 వేలు బాకీ ఉంది.. మీ కోసం మా కార్యకర్తలు జైలుకు వెళ్తున్నారు.. దుబ్బాకలో, జి హెచ్ ఎం సి ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు.. మేధావి వర్గం ఓటు వేస్తున్నారు.. టి ఆర్ ఎస్ కి ఓటు వేస్తే చెప్పుకు ఓటు వేసినట్లే..  అయోధ్య లో రామ మందిరం అద్భుతం గా నిర్మాణం కాబోతోంది.. దీని కోసం 4 లక్షల మంది  కర సేవకులు ప్రాణ త్యాగం చేశారు.. అని బండి సంజయ్ గుర్తు చేశారు. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతోంది.. త్యాగాలు చేస్తోందని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసి, కశ్మీర్ లో జెండా ఎగురవేశామన్నారు. తెలంగాణ లో దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. విద్యావ్యవస్థ ని చిన్నా భిన్నం చేశారు..  మెడకాయ మీద తలకాయ ఉందా ? కేసీఆర్ కి.. అన్ని సమస్యల పరిష్కారం కోసం ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకం.. బీజేపీ ని గెలిపించాలి.. బిజెపి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి.. అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప.. క్యాచ్ అందుకున్న డెలివరీ బాయ్

అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

ఆనంద్ మహీంద్రా ట్వీట్: ఇది ఎలిఫెంట్ కాదు.. ఎలీ-ప్యాంట్