
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్) చైర్మన్ శివసేనా రెడ్డి అన్నారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న నేషనల్ గేమ్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారులకు నగదు పురస్కారం అందిస్తామన్నారు.
బంగారు పతకానికి రూ. 10 లక్షలు, రజత పతకానికి రూ. 5 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు చొప్పున ప్రోత్సాహం అందిస్తామని సోమవారం ప్రకటించారు. అండర్19 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ గొంగడి త్రిషకు అభినందనలు తెలిపారు.