చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేస్తారా..? ఈజీగా లోన్లు.. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రకటన

చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేస్తారా..? ఈజీగా లోన్లు.. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్​ఎంఈలు)లకు ఆర్థికంగా తోడ్పాటును అందించడానికి వారికి సులువుగా గోల్డ్​ లోన్లు ఇస్తామని  ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రకటించింది. భారతీయులకు ఆర్థిక వృద్ధి భాగస్వామిగా నిలవాలని కోరుకుంటున్నట్టు ప్రకటించింది. ఎక్కువ డాక్యుమెంట్లు లేకుండా, తక్కువ సమయంలో లోన్లు ఇస్తామని పేర్కొంది. దరఖాస్తు చేసిన రోజే లోన్​ఇస్తామని,  వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయని తెలిపింది. వ్యక్తిగత ఆర్థిక అవసరాలకు సరిపోయే విధంగా ఈఎంఐ ఆప్షన్లు అందిస్తున్నట్లు సంస్థ వివరించింది. కస్టమర్లు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ  గోల్డ్ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సులభంగా పొందవచ్చని, వాటిని మేనేజ్​చేసుకోవచ్చని ప్రకటించింది.