కరోనాపై ఐఐటీల పోరు: రూ.120 కోట్లతో 208 ప్రాజెక్టులు

కరోనాపై ఐఐటీల పోరు: రూ.120 కోట్లతో 208 ప్రాజెక్టులు

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (ఐఐటీ)లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. టెస్టింగ్​ కిట్ల నుంచి మెడికల్​ పరికరాల వరకు అన్నింటినీ తయారు చేస్తూ ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఈమధ్యనే ఐఐటీ ఢిల్లీ కరోనా టెస్టింగ్​ కిట్​ను తయారు చేసింది. దాని పనితీరును పరిశీలించిన ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​), టెస్టింగ్​కు కిట్​ ఓకే చెప్పింది. దాని ఖరీదు కూడా చాలా తక్కువ. ఆ బాటలోనే దేశంలోని 18 ఐఐటీలు 208 ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. ఆ ప్రాజెక్టులకు రూ.120 కోట్ల మేర ఖర్చు పెడుతున్నాయి. మరి, ఏయే ఐఐటీలు ఏమేం తయారు చేస్తున్నాయి? ఇదిగో ఆ లిస్ట్​…

ఐఐటీ ఖరగ్​పూర్​: మొత్తం 14 ప్రాజెక్టులపై పనిచేస్తోంది ఐఐటీ ఖరగ్​పూర్​. 4 పీపీఈ కిట్స్​, 4 టెస్టింగ్​కిట్లు, ఒక శానిటైజేషన్​, 2 మెడికల్​ పరికరాలు/రోబో, 2 ట్రీట్​మెంట్​ ప్రాజెక్టులు, ఒక డేటా ఎనలిటిక్స్​ ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి.
ఐఐటీ మద్రాస్​: 25 ప్రాజెక్టులపై పనిచేస్తోంది. 5 పీపీఈ కిట్లు, 5 టెస్టింగ్​ కిట్లు, 5 శానిటైజేషన్​, 5 మెడికల్​ పరికరాలు/రోబో, 3 సర్వైలెన్స్​ (నిఘా), 2 ట్రీట్​మెంట్​ సంబంధిత ప్రాజెక్టులు నడుస్తున్నాయి.
ఐఐటీ బాంబే: 10 ప్రాజెక్టులపై వర్క్​ చేస్తోంది. 3 శానిటైజేషన్​, ఒక మెడికల్​ ఎక్విప్​మెంట్​/రోబో, 2 సర్వైలెన్స్​, 4 ట్రీట్​మెంట్​ సంబంధ ప్రాజెక్టులు లైన్​లో ఉన్నాయి.
ఐఐటీ ఢిల్లీ: 12 ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. అందులో 5 పీపీఈ కిట్స్​, 2 టెస్టింగ్​ కిట్లు, ఒక శానిటైజేషన్​, ఒక మెడికల్​ ఎక్విప్​మెంట్​, 3 ట్రీట్​మెంట్​ సంబంధ ప్రాజెక్టులున్నాయి.
ఐఐటీ కాన్పూర్​: 6 ప్రాజెక్టులపై పనిచేస్తోంది ఐఐటీ కాన్పూర్​. ఒక పీపీఈ ప్రాజెక్ట్​, ఒక శానిటైజేషన్​, 2 మెడికల్​ ఎక్విప్​మెంట్​/రోబో, ఒక సర్వైలెన్స్​, ఒక ట్రీట్​మెంట్​ ప్రాజెక్టులు ఆ లిస్టులో ఉన్నాయి.
ఐఐటీ గౌహతి: 34 ప్రాజెక్టులపై పనిచేస్తోంది. 12 పీపీఈ ప్రాజెక్టులు, 2 టెస్టింగ్​ కిట్లు, 2 శానిటైజేషన్​, 12 మెడికల్​ ఎక్విప్​మెంట్​/రోబో, ఒక సర్వైలెన్స్​, 2 ట్రీట్​మెంట్​ ప్రాజెక్టులు, 3 డేటా ఎనలిటిక్స్​, ఏఐ మోడల్​ అండ్​ ఎపిడెమిక్​ ప్యాటర్న్​, డిసీజ్​ డైనమిక్స్​ప్రాజెక్టులపై పరిశోధనలు నడుస్తున్నాయి.
ఐఐటీ మండి: ఐఐటీ మండి మూడు ప్రాజెక్టులపై పనిచేస్తోంది.
ఐఐటీ పాలక్కడ్​: పది ప్రాజెక్టులపై పరిశోధనలు నడుస్తున్నాయి. ఇవి కాకుండా ఐఐటీ రూర్కీ, హైదరాబాద్, భువనేశ్వర్​, జోధ్​పూర్​, ఇండోర్​, ధన్​బాద్​, జమ్మూ, బీహెచ్​యూ, పాట్నా, గోవాల్లోని ఐఐటీలు కరోనాకు సంబంధించి వివిధ ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి.