గుజరాత్ కు అక్రమంగా రేషన్ బియ్యం

గుజరాత్ కు అక్రమంగా రేషన్ బియ్యం

ఎల్​బీనగర్,వెలుగు :  సిటీ నుంచి గుజరాత్ కు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద 31.7 టన్నుల బియ్యం లారీ, రెండు సెల్ ఫోన్లను ఎల్ బీనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి చెందిన సంజీవరెడ్డి లారీ డ్రైవర్. కర్ణాటకలోని బీదర్ కు చెందిన పరమేశ్వర్ సంజీవరెడ్డికి అసిస్టెంట్. ఇద్దరూ కలిసి శుక్రవారం మలక్ పేట్ లో రేషన్ బియ్యాన్ని తీసుకుని లారీ లోడ్ తో గుజరాత్ కు తీసుకెళ్తున్నారు. 

ఎల్ బీనగర్ మెట్రో స్టేషన్ వద్దకు  లారీ రాగానే సమాచారం అందుకున్న ఎల్ బీనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ కు చెందిన హున్ సరమణ్ భూపత్ ఆదేశాల మేరకు సిటీలో ఉండే రిజ్వాన్ తక్కువ ధర బియ్యం కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.