- ఈ ఏడాది రూ.వెయ్యి కోట్ల ఆదాయం టార్గెట్..
- స్టేట్మైన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ భవేశ్ మిశ్రా
నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు, ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ‘మన ఇసుక వాహనం’ స్కీమ్ ను తెస్తున్నామని స్టేట్ మైన్స్డెవలప్మెంట్కార్పొరేషన్ ఎండీ భవేశ్‌మిశ్రా తెలిపారు. ఖమ్మం, కరీంనగర్, కొత్తగూడెం, నిజామాబాద్జిల్లాల్లో పైలెట్‌ప్రాజెక్టు కింద అమలు చేయనున్నామని చెప్పారు.
శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలు నేరుగా ఆన్లైన్బుకింగ్తో ఇసుక పొందే అవకాశం ఉంటుందన్నారు. ఫోన్‌నంబర్ ద్వారా యాప్‌లో ఇసుక బుకింగ్చేసుకొని డైరెక్ట్‌గా పొందవచ్చన్నారు. పంచాయతీ సెక్రటరీని కూడా సంప్రదించి బుకింగ్చేసుకోవచ్చన్నారు. రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్, పంచాయతీరాజ్శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ఆలోచనను సక్సెస్చేయాలని సూచించారు.
నాలుగు జిల్లాల్లో అమలు చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. గతేడాది మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.738 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు టార్గెట్పెట్టుకున్నామని పేర్కొన్నారు. ‘ మన ఇసుక వాహనం’ స్కీమ్‌ను సక్సెస్చేయాలని కలెక్టర్ఇలా త్రిపాఠి కోరారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తే ఆఫీసర్లను బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించమన్నారు.
తహసీల్దార్లు స్థానికంగా ఉండాలని సూచించారు. అనంతరం మన ఇసుక వాహనం పవర్పాయింట్ప్రజంటేషన్ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్కిరణ్కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్ఞాన్ మాల్వియా, ఆర్డీవో రాజేంద్రకుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, మైనింగ్ఏడీ సంజయ్‌కుమార్, హౌసింగ్‌పీడీ పవన్‌కుమార్ అధికారులు పాల్గొన్నారు.
