దుబాయ్: క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో టీ20 టోర్నీ సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆసక్తి రేపుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్‌టీ20) 2026 సీజన్ షెడ్యూల్ బుధవారం విడుదలైంది. ఐదో సీజన్ నవంబర్ 21న ప్రారంభం కానుంది. మొత్తం 34 మ్యాచ్‌లు జరగనుండగా.. డిసెంబర్ 20న ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది. తొలి మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.
డిఫెండింగ్ చాంపియన్ డెజర్ట్ వైపర్స్‌తో గత సీజన్ రన్నరప్ ఎంఐ ఎమిరేట్స్ తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు కూడా దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ఆరు జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. డెజర్ట్ వైపర్స్, అబుదాబి నైట్ రైడర్స్, దుబాయ్ క్యాపిటల్స్, గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్జ్ బరిలోకి దిగనున్నాయి.టోర్నీలో మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు లేదా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 వరకు నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 34 మ్యాచ్‌లతో టీ20 సందడి కొనసాగనుంది.
