అసదుద్దీన్....కేటీఆర్ భేటీ

అసదుద్దీన్....కేటీఆర్  భేటీ

టాలెంట్ ఎవరి సొత్తు కాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నాలుగు సంవత్సరాలుగా రన్ చేస్తున్నామన్న కేటీఆర్.. వినూత్న ఆలోచనలతో  ఔత్సాహిక యువకులు ఎవరు ముందుకు వచ్చినా తాము సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇమేజ్ టవర్స్ ను 2023 లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టీ వర్క్స్ ను ప్రారంభిస్తామని చెప్పారు. చైనాకు చెందిన ఫాక్స్ కాన్ ఛైర్మన్ యంగ్ లీవ్ టీ వర్క్స్ ను ప్రారంభిస్తారన్నారు. ఇక్కడ వందల వేల స్టార్టప్ లు పనిచేస్తాయన్న మంత్రి కేటీఆర్... టీ వర్క్స్ ఫేజ్ వన్ 78.వేల sft  లో నిర్మించామని తెలిపారు. ఫేజ్ 2 ను 2.50 లాక్ sft లో నిర్మిస్తామని తెలిపారు. రూ.15 వేల కోట్ల మిషనరీతో టీ వర్క్స్ ప్రారంభం అవుతుందన్నారు. రూ.100 కోట్లకు పైగా విలువ చేసే మిషనరీకి పెట్టుబడులు తెచ్చెదుకు ప్లాన్ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. 

గ్రామీణ ప్రాంత ఓత్సాహిక యువతకు టీ వర్క్స్ ఉపయోగపడుతుందన్న కేటీఆర్.. డిజైనింగ్ ఇన్నోవేషన్ , మెటీరియల్ సైన్స్ పై  విద్యార్థుల్లో అవగాన పెంచాలని సూచించారు. టీ వర్క్స్ ను స్కూల్ విద్యార్థులకు కూడా తీసుకు వస్తామని, వారికి కూడా అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ లలో ఇక్కడ జరిగే ఇన్నోవేషన్స్ తెలిసేలా శాటిలైట్ సెంటర్స్ పెడతామని చెప్పారు. గ్రామీణ ప్రాంత ఇన్నోవేటర్స్ కు జిల్లాలో ఉన్న ఐటీ టీమ్ గైడ్ చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం  టీ-వర్క్స్ లో కేటీఆర్ ను ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిశారు. కాగా ఆయన వియ్యంకుడు డాక్టర్​ఆత్మహత్య చేసుకున్న తర్వాత మంత్రి కేటీఆర్​ను అసదుద్దీన్​కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.