ఇమామ్, మౌజమ్ ల గౌరవ వేతనం పెంచుతం : మంత్రి అజారుద్దీన్

ఇమామ్, మౌజమ్ ల గౌరవ వేతనం పెంచుతం : మంత్రి అజారుద్దీన్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇమామ్, మౌజమ్​లకు గౌరవ వేతనాన్ని రూ.10 వేలు ఇస్తామని మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్​ అజారుద్దీన్​స్పష్టం చేశారు. ప్రస్తుతం రూ.5వేలు చెల్లిస్తున్నట్లు శుక్రవారం మండలిలో తీన్మార్​మల్లన్న అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 16వేల 500 మంది ఇమామ్, మౌజంలకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.160 కోట్లు,  2025–26లో రూ.96కోట్లు చెల్లించినట్లు తెలిపారు.