
బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడింది . దీని ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఉత్తర,ఈశాన్య జిల్లాల్లో రానున్న రెండు రోజులు భారీవర్షాలు పడనున్నాయి. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.
సెప్టెంబర్ 2న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది
ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ) తో కూడిన వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.