బీ అలర్ట్ : ఈ ఎండాకాలం..ఇండియా మండిపోతుంది

బీ అలర్ట్ : ఈ ఎండాకాలం..ఇండియా మండిపోతుంది

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలురాష్ట్రాల్లో మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం9 దాటితే ఇంట్లోంచి బయటి రావాలం టేనే జనం భయపడుతున్నారు. ఇక మిట్ట మధ్యాహ్నం పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ రద్దీ ఉంటే రహదారులు, నగరాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తారు రోడ్లపై ఎండమావిలు కాస్తున్నాయి..మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు ఇలా వుంటే..ఇక ఏప్రిల్, మేనెలల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.  ఈసారి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు. 

ఏప్రిల్, జూన్ నెలలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడి, వడగాల్పులు ఉండొచ్చని భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం (ఏప్రిల్ 1) అంచనా వేసింది. గుజరాత్ , కేరళ, మహారాష్ట్ర,కర్ణాటక , రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో  వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరిస్తోంది.


కేరళలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో ఇప్పటికే 12 జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ లు జారీ చేసింది.ఈ జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 వరకు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.  

also read : సునామీలా ఊర్లోకి వచ్చిన సముద్రం.. బోట్లు గల్లంతు

గడిచిన ఏప్రిల్ లో దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు నమోదు అయ్యాయి. ఏప్రిల్ లో సగటు ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో ఉండటం 122 ఏళ్లలో ఇది నాలుగో సారి అని ఐఎండీ తెలిపింది. అంతకుముందు 1973, 2010, 2016లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొన్ని వారాలుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి.