హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తక్షణమే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్(ఈహెచ్‌ఎస్) అందించాలని పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈహెచ్‌ఎస్ అమలుపై ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ, ఇంతవరకు దానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను విడుదల చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈహెచ్‌ఎస్ అమలు కోసం మే నెల జీతం నుంచి 1.5 శాతం నిధులను సర్కారు కట్ చేసిందని నేతలు గుర్తు చేశారు. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందించే ఆస్పత్రుల జాబితాను ఇంతవరకు ప్రకటించకపోవడం సరికాదన్నారు. ఈహెచ్‌ఎస్ అమలుతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏ వాయిదాల చెల్లింపు, పీఆర్సీ నివేదిక సమర్పణలో జరుగుతున్న ఆలస్యంపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. EHS Telangana, Pensioners JAC,
