ఇమ్రాన్ ఖాన్ పై విష ప్రయోగం జరగొచ్చు : భార్య బుష్రా

ఇమ్రాన్ ఖాన్ పై విష ప్రయోగం జరగొచ్చు : భార్య బుష్రా

తోషాఖానా అవినీతి కేసులో ఆగస్టు 5న అరెస్టయిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విష ప్రయోగం జరిగే ప్రమాదముందని ఆయన భార్య బుష్రా ఆరోపించారు. ఆయనకు జైళ్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.

తన భర్తను పంజాబ్‌లోని అటాక్ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలాకు తరలించాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించిందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్, ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా పంజాబ్ హోం కార్యదర్శికి లేఖ రాసింది. “నా భర్త తప్పు లేకుండానే అటాక్ జైలులో బంధించారు. చట్టం ప్రకారం నా భర్తను అడియాలా జైలుకు తరలించాలి' అని ఆమె అన్నారు. పీటీఐ చీఫ్‌కు సామాజిక, రాజకీయ హోదా దృష్ట్యా జైలులో బి-క్లాస్ సౌకర్యాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేసినట్లు సమాచారం. అటాక్ జైలులో ఖాన్‌కు విషం తాగించవచ్చని కూడా బుష్రా తెలిపింది. ఖాన్‌పై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయని, అందులో ప్రమేయం ఉన్నవారిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఆమె ఆరోపించారు.

"అతను ఇంకా ప్రమాదంలోనే ఉన్నాడు. అటాక్ జైలులో ఉన్న నా భర్తపై విష ప్రయోగం చేస్తారని భయంగా ఉంది" అని బుష్రా లేఖలో రాసుకువచ్చింది. ఈ నెల ప్రారంభంలో, బుష్రా తన భర్తను ఓ అరగంట సేపు కలిసింది. ఆ సమయంలో ఖాన్ తన బాధాకరమైన పరిస్థితులను వెల్లడించాడని, సి-క్లాస్ జైలు సౌకర్యాలు అందిస్తున్నట్టు చెప్పాడని ఆమె తెలిపింది. జైలులో ఉన్న ఖాన్ కు ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకు అనుమతించాలని బుష్రా తన లేఖలో కోరింది. జైలు నిబంధనల ప్రకారం ఖాన్‌కు 48 గంటల్లో అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందని, అయితే 12 రోజులు దాటినా ఎలాంటి సమాచారం లేదని ఆమె అన్నారు. "జైలు నిబంధనల ప్రకారం, నా భర్తకు ప్రైవేట్ వైద్యుడిచే వైద్య పరీక్షలు చేయించుకునే హక్కు ఉంది" అని ఆమె అన్నారు.

ఇదిలా ఉండగా తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఇమ్రాన్ ను దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే, లాహోర్ హౌస్ లో ఉన్న అమీర్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. 2018-2022 పదవీకాలంలో అతను, అతని కుటుంబం రాష్ట్ర బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలపై అతనికి శిక్ష విధించారు. ఈ క్రమంలోనే అతన్ని ఐదేళ్ల పాటు రాజకీయాల నుంచి కూడా నిషేధించారు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించారు. కానీ తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని ఖాన్ ఖండించారు.