70 ఏండ్ల అలవాటు తేలిగ్గా పోదు : కాంగ్రెస్​పై ప్రధాని మోదీ విమర్శలు

70 ఏండ్ల అలవాటు తేలిగ్గా పోదు : కాంగ్రెస్​పై ప్రధాని మోదీ విమర్శలు

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వివాదాస్పద కామెంట్లపై కమలం పార్టీ నేతలు గట్టిగా బదులిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు.  ‘‘తమ అహంకారం, అబద్ధాలు, నిరాశావాదం, అజ్ఞానంతో వారు ఆనందంగానే ఉండవచ్చు. కానీ, వారి విభజన ఎజెండా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అది 70 ఏండ్లుగా వారికి అలవాటైన పద్ధతి. అంత తేలిగ్గా పోదు..” అని మోదీ  అన్నారు.

కానీ, ఇప్పుడు ప్రజలు విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని, అందువల్ల మున్ముందు మరిన్ని ఘోర పరాభవాలకు వారు(కాంగ్రెస్) సిద్ధంగా ఉండాలని ప్రధాని ఎద్దేవా చేశారు. ఈ పోస్ట్​కు ప్రధాని వార్నింగ్(హెచ్చరిక), నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. దీంతో మోదీ పోస్ట్​ చూసి నెటిజన్లు ఆశ్చర్యపడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.