Police Recruitment:దున్నపోతుకు వినతిపత్రం

Police Recruitment:దున్నపోతుకు వినతిపత్రం

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు తీర్చాలని పలు విద్యార్థి సంఘాలు వినూత్నరీతిలో నిరసన తెలియజేశారు. హబ్సిగూడలో దున్నపోతుకు వినతి పత్రం అందజేసి తమ నిరసనను తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎస్సై,కానిస్టేబుల్ అభ్యర్థులు తమ  డిమాండ్లను నెరవేర్చాలని  ప్రభుత్వానికి,అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని  విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాస్ రావు అనాలోచిత నిర్ణయాల వల్ల ఎస్సై,కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ సర్కార్ దిగివచ్చి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.