V6 News

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్.. పంజాబ్దే ఫస్ట్ బ్యాటింగ్

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్.. పంజాబ్దే ఫస్ట్ బ్యాటింగ్

PBKS VS RR: ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడుతున్నాయి. న్యూ చండీగఢ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నా డు. ఈ సీజన్‌లో అజేయంగా కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్‌ను అడ్డుకోవాలని రాజస్థాన్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు చేశాయి.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేస్తాం.. ఇది చాలా మంచి వికెట్‌లా కనిపిస్తోంది, కానీ కొద్దిగా మబ్బులు కమ్ముకుని, చిరుజల్లులు కూడా పడ్డాయి, కాబట్టి ఆరంభంలో కొంచెం డ్యూ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుని, కొన్ని ఆరంభ వికెట్లు తీసి, లక్ష్యాన్ని ఛేజ్ చేయాలని ఆశిస్తున్నాం.. జట్టులో రెండు మార్పులు చేశాం.. హెట్మయర్ స్థానంలో దాసున్ షనక, రవి బిష్ణోయ్ స్థానంలో యశ్ పుంజా జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు. 

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాం, ఎందుకంటే వర్షం కురిసే అవకాశం ఉంది.. మొదట బ్యాటింగ్ చేయడం వలన త్వరగా వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది.. అయితే, టాస్ ఫలితంతో సంబంధం లేకుండా మేమందరం చాలా చురుకుగా ఉంటాం.. మేము జట్టులో ఒక తప్పనిసరి మార్పు చేశాం.. శశాంక్ సింగ్ స్థానంలో సూర్యాంశ్ (షెడ్జ్) వస్తున్నాడు, అలాగే X (జేవియర్ బార్ట్‌లెట్) స్థానంలో లాకీ (ఫెర్గూసన్) తుది జట్టులోకి వస్తున్నాడని వెల్లడించాడు. 

జట్లు:
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కొన్నోలీ, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా