V6 News

శంషాబాద్ టు ముంబై, బెంగళూరు, అమరావతికి బుల్లెట్ ట్రైన్ : సీఎం రేవంత్

శంషాబాద్ టు ముంబై, బెంగళూరు, అమరావతికి బుల్లెట్ ట్రైన్ : సీఎం రేవంత్

కేంద్రం దేశవ్యాప్తంగా ఏడు బులెట్ ట్రైన్లను ప్రకటిస్తే.. అందులో మూడు మన రాష్ట్రానికే రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ కేంద్రంగా ముంబై, బెంగళూరు, అమరావతి నగరాలను అనుసంధానిస్తూ బులెట్ రైళ్లు పరుగులు తీయబోతున్నాయని చెప్పారు. కేవలం రైళ్లే కాదు.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ బస్సు టెర్మినల్‌ను కూడా మనం నిర్మించుకోబోతున్నామని రేవంత్ తెలిపారు.

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు శంకుస్థాపన చేసిన రేవంత్..  మెట్రో, బులెట్ ట్రైన్, అత్యాధునిక బస్ టెర్మినల్.. ఇవన్నీ ఒకే చోట ఏర్పాటు కాబోతున్నాయన్నారు.  త్వరలోనే రంగారెడ్డి జిల్లా ఒక మహా అద్భుతానికి సాక్ష్యం కాబోతోందని చెప్పారు. తాను కూడా ఈ గడ్డ నుండే ఊరికి వెళ్తాను.. అందుకే మీపై ఉన్న అభిమానంతో, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం అద్భుతమైన ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. 

 ఫ్యూచర్ లేనివాడు ఫ్యూచర్ సిటీ అంటున్నాడని కొందరు అంటున్నారు... నా మీద ఏడ్చే వారికి నేను చెప్పేది ఒక్కటే.. మీరు ఏడ్చుకుంటూనే ఉండండి, నేను నా పని చేసుకుంటూనే పోతా.. మీ ఏడుపే నా చెవులకు వినిపించే మధుర సంగీతం అని  రేవంత్  అన్నారు.